: ఐఏఎస్, ఐపీఎస్ లపై విరుచుపడండి!... భారత ముస్లింలకు ఆల్ కాయిదా పిలుపు!
దేశంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పెను ముప్పే పొంచి ఉంది. ప్రభుత్వ పాలనలో ఐఏఎస్ లు కీలక భూమిక పోషిస్తుండగా, దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతను ఐపీఎస్ లు తమ భుజస్కందాలపై వేసుకున్నారు. ఇంతటి కీలక బాధ్యతల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చంపేయండి అంటూ ఆల్ కాయిదాకు అనుబంధంగా పనిచేస్తున్న 'ఆల్ కాయిదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్' (ఏక్యూఐఎస్) చీఫ్ మౌలానా అసిమ్ ఉమర్ భారత ముస్లింలకు పిలుపునిచ్చాడు. యూరోప్ లో జరుగుతున్న భయానక దాడులను స్ఫూర్తిగా తీసుకుని భారత్ లోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను హత్య చేయాలని అతడు ఇటీవల ఇచ్చిన పిలుపు దేశంలో కలకలం రేపుతోంది.