: నెట్టింట బీజేపీపై కాంగ్రెస్ వినూత్న పోరు!... మాట తప్పేవారిని నరేంద్ర మోదీ ప్రతినిధి అంటూ పోస్ట్!


కేంద్రంలో అధికార పార్టీ బీజేపీపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం అంతగా ఫలితాలివ్వడం లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం తేటతెల్లమైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థిపై నెట్టింట పోరు ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ నిన్న తన అధికారిక వెబ్ సైట్ లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను పెట్టింది. ఇందులో ‘మాట తప్పేవారికి మోదీ ప్రతినిధి’ అంటూ ఆ పార్టీ వినూత్న ప్రచారానికి తెర లేపింది. ‘‘హామీలను తుంగలో తొక్కడంలో మోదీ పోస్టర్ బాయ్ గా మారిపోయారు. మోదీ ఎన్నో వాగ్దానాలు చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని 1.35 లక్షల ఉద్యోగాలే ఇచ్చారు. మోదీ దౌత్యం వల్ల గురుదాస్ పూర్, పఠాన్ కోట్ దాడులు, వెయ్యి కాల్పుల విరమణ ఉల్లంఘనలే ఫలితాలుగా వచ్చాయి. స్త్రీలపై నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రధాని మోదీ, ఆరెస్సెస్ అబద్ధాల పాలనపై పోరాడి ప్రతి పౌరుడు దేశాన్ని కాపాడుకోవాలి’’ అంటూ ఆ పోస్ట్ లో కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

  • Loading...

More Telugu News