: బాగ్దాద్ లో ఐఎస్ నరమేధం!... 172 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూక!


ఇరాక్ లో తమదైన ‘కాలిఫేట్’ రాజ్యాన్ని స్థాపిస్తామంటూ రంగంలోకి దిగిన ఉగ్రమూక ఆ దేశ రాజధాని బాగ్దాద్ లో నిన్న నరమేధానికి పాల్పడింది. వరుస సూసైడ్ బాంబర్ల దాడిలో ఏకంగా 172 మందిని పొట్టనబెట్టుకుంది. 350 మందికి పైగా గాయాలపాల్జేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ను పురస్కరించుకుని జనంతో కిక్కిరిసిన బాగ్దాద్ లో షాపింగ్ మాల్స్ ను లక్ష్యంగా చేసుకుని ఆ సంస్థ చేసిన దాడిలో నగరంలో భీతావహ వాతావరణాన్ని సృష్టించింది. ఈ దాడితో నగరంలోని కుర్రాదా ప్రాంతంలోని వాణిజ్య సముదాయాలు నేలమట్టమయ్యాయి. అప్పటిదాకా ముస్లింల కొనుగోళ్లతో సందడిగా ఉన్న ఆ ప్రాంతం దాడి తర్వాత బాధితుల ఆర్తనాదాలతో వణికిపోయింది. విశ్వవ్యాప్తంగా ఐఎస్ పాల్పడుతున్న మారణ హోమాల్లో ఈ దాడి భారీ నష్టం మిగిల్చిన భీకర దాడిగా నిలిచింది.

  • Loading...

More Telugu News