: నేనెప్పటికీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోను : సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్


తానెప్పటికీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోనని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తానేం చేసినా పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, తానెందరో కార్యకర్తలను నాయకులుగా చేశానని, తానెప్పటికీ రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకోనని చెప్పారు. రెడ్డి కులస్తులకు తాను వ్యతిరేకం కాదని, బీసీలు, కాపుల కోసం తానెప్పుడూ మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు. యువరక్తంతో పాటు తన లాంటి సీనియర్ల సలహాలు పార్టీకి అవసరమని, 2019లో ఎవరు నాయకులుగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వీహెచ్ జోస్యం చెెప్పారు.

  • Loading...

More Telugu News