: ఒకేఒక్క డైలాగ్ నచ్చి ఆ సినిమా చేశాను: అల్లరి నరేష్
తాను చేసిన వాటిలో తనకు బెస్ట్ మూవీ అంటే ‘గమ్యం’ అని ప్రముఖ నటుడు అల్లరి నరేష్ చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించి తనకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారని, ఆ స్క్రిప్ట్ చదువుతుంటే... చివరిలో ఒకేఒక్క డైలాగ్ చూసి తాను ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నానని నాటి విషయాలను నరేష్ గుర్తు చేసుకున్నాడు. ‘శ్రీనుగాడు సీనైపోయాడు బాసు’ ఆ డైలాగ్ చదువుతుంటే, తన కళ్ల వెంబడి నీళ్లొచ్చేశాయని, తప్పకుండా ఈ సినిమా చేయాలని అనుకున్నానని చెప్పాడు. అయితే, 2003 లో అనుకుంటే 2007లో ఈ చిత్రం కార్యరూపం దాల్చిందని నరేష్ చెప్పుకొచ్చాడు.