: నాని, నేను బాగా కలుస్తుంటాం: అల్లరి నరేష్


నాని, తాను తరచుగా కలుస్తుంటామని ప్రముఖ నటుడు అల్లరి నరేష్ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, షూటింగ్ అయిపోయిన తర్వాత తాము కలుస్తుంటామని చెప్పాడు. తమ పని గురించి తప్ప పెద్దగా ఏమీ మాట్లాడుకోమని అన్నాడు. సరదాగా సినిమాకు వెళ్లడమో, లేక వేరే చోటుకు వెళ్లడమో చేస్తుంటామని చెప్పాడు. తన సినిమాల గురించి చెబుతూ, ‘వారంలో ఆరురోజులు వెజ్ భోజనం చేసి, ఏడో రోజు నాన్ వెజ్ చేస్తే కుమ్మేస్తాము. అలాగే, చేసే సినిమాల్లో కూడా కొత్తదనం ఉండాలి' అని అల్లరి నరేష్ చెప్పాడు.

  • Loading...

More Telugu News