: సహాయక చర్యల్లో పాల్గొన్న విమానం కుప్పకూలి ఆరుగురు మృతి
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో అగ్నిప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న ఒక విమానం కుప్పకూలిన సంఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయారు. ఈరోజు తెల్లవారుజామున ఐఎల్-76 రవాణా విమానం దట్టమైన అటవీ ప్రాంతం ఇర్కుస్టాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం వెనుక భాగం తప్ప మిగిలినది తునాతునకలైపోయింది. సంఘటనా స్థలం నుంచి ఆరు మృతదేహాలను వెలికితీసినట్లు ఆర్ఏఐ వార్తా సంస్థ పేర్కొంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమానంలో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం.