: ఇందిరాగాంధీ నన్ను తన మూడో కొడుకు అనేవారు!: కరణం బలరాం


దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తనను మూడో కొడుకుగా చూసుకునేదని కరణం బలరాం చెప్పారు. నాటి విషయాలను ప్రస్తావించగా ఆయన మాట్లాడుతూ,‘1978లో ఎలక్షన్ టూర్ నిమిత్తం కర్ణాటక నుంచి ఒంగోలుకు వచ్చింది. ఆమెకు ఏర్పాటు చేసిన డయాస్ కూలిపోయింది. మాజీ ప్రధానిగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెకు సరైన భద్రత కల్పించలేదు. ఒక్క పోలీసోడు కూడా లేడు. ఆ రోజుల్లో ఉన్న నాయకులు ఆమెను ఏదో ఒక విధంగా ఇన్ సల్ట్ చేయాలని చెప్పి, ఆమెకు సెక్యూరిటీ లేకుండా చేశారు. అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న నేను స్వయంగా కారు నడుపుతూ ఆమెను మా జిల్లా దాటించాను. ఇందిరాగాంధీని అలా నేను ప్రొటెక్టు చేసిన తర్వాత ఆమె అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఒకసారి జరిగిన మీటింగ్ లో ‘బలరాం ఈజ్ మై థర్డ్ సన్’ అని ఇందిరాగాంధీ అంది. ఇంతకంటే ఏంకావాలి, వందల, వేల కోట్లు వస్తే ఆ తృప్తి వస్తుందా?’ అని బలరాం ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News