: అభివృద్ధి చేయలేదని ఎవరైనా నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా: కరణం సవాల్
తాను అభివృద్ధి పనులు చేయలేదని ఎవరైనా సరే నిరూపిస్తే, రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానంటూ టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం ఛాలెంజ్ చేశారు. కరణం బలరామంటే కత్తులు కటార్లు తప్పా, ఎటువంటి అభివృద్ధి ఉండదంటారు, నిజమేనా? అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. అవసరమైతే తన నియోజకవర్గంలోకి వెళ్లి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో చూడాలని ఆయన అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు తన హయాంలో కట్టించిందేనని, ఆ ప్రాజెక్టు పుణ్యానే ఈరోజు ఒంగోలు ప్రజలు కూడా నీళ్లు తాగుతున్నారని అన్నారు. ఇదంతా అభివృద్ధి చేసినట్లు కాదా? అని బలరాం ప్రశ్నించారు.