: విజయవాడలో ఇకపై దేవాలయాల తొలగింపు ఉండదు: మంత్రి ప్రత్తిపాటి


విజయవాడలో ఇకపై దేవాలయాల తొలగింపు ఉండదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆలయాల కూల్చివేతపై చర్చించే నిమిత్తం మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మాణిక్యాలరావు, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్రలతో ఒక కమిటినీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈరోజు భేటీ అయింది. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, తొలగించిన ఆలయాలను పరిశీలించేందుకు వెళ్తున్నామని, అక్కడి పరిస్థితులను చూసి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా, ఈ సమావేశం నుంచి టీడీపీ ఎంపీ కేశినేని నాని మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ సమావేశానికి హాజరైన విజయవాడ మునిసిపల్, పోలీసు కమిషనర్లు సంబంధిత వివరాలను మంత్రులకు తెలియజేశారు.

  • Loading...

More Telugu News