: ప్రపంచ భారీ టెలిస్కోప్ నిర్మాణం పూర్తి!
అంతరిక్ష పరిశోధనలు, గ్రహాంతర వాసుల అన్వేషణ కోసం చైనా భారీ రేడియో టెలిస్కోప్ సిద్ధమైంది. ఈ టెలిస్కోప్ కు చివరి ప్యానల్ ను ఈరోజు అమర్చడంతో దీని నిర్మాణం పూర్తయింది. చైనాలోని గుయ్ జౌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ భారీ టెలిస్కోప్ పరిమాణం 30 ఫుట్ బాల్ మైదానాలంత ఉంటుంది. ఈ భారీ టెలిస్కోప్ ను ఫైవ్ హండ్రెడ్ మీటర్ అపెర్చూర్ స్ఫియరికల్ టెలిస్కోప్ (ఫాస్ట్)గా పిలుస్తారు. దీనికి సంబంధించిన డీబగ్గింగ్, ట్రయల్స్ ప్రారంభిస్తామని చైనా జాతీయ అస్ట్రొనామికల్ అబ్జర్వేషన్ డిప్యూటీ హెడ్ జెంగ్ గ్జియానియన్ వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి ఫాస్ట్ తన పనులను ప్రారంభించనుందని చెప్పారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కింద పనిచేసే దీని నిర్మాణానికి 5 సంవత్సరాలకు పైగా సమయం పట్టిందని, 180 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ భారీ ప్రాజెక్ట్ ను చేపట్టడం జరిగిందని చెప్పారు.