: ‘జై ఆంధ్రా’ అన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత
టీఆర్ఎస్ ఎంపీ కవిత ‘జై ఆంధ్రా’ అనే నినాదం చేశారు. ఆమె ఈ నినాదం చేసింది తెలుగు రాష్ట్రాల్లో అయితే కాదు. మరెక్కడా? అని ప్రశ్నిస్తే, దానికి సమాధానం చికాగోలో నిర్వహించిన తానా వేడుకల్లో. ఈ వేడుకల్లో పాల్గొన్న కవిత అక్కడ ప్రసంగించిన సందర్భంలో ఈ నినాదం చేశారు. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నానని, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడిన కవిత ‘జై తెలంగాణ’,‘జై ఆంధ్రా’ అనే నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించడం విశేషం.