: మాపై పెత్తనం చేయాలని కొందరు చూస్తున్నారు: టీడీపీ ఎంపీ కేశినేని నాని
తమపై విమర్శలు చేస్తున్న కొందరు పెత్తనం చెలాయించేందుకు చూడటం సరికాదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడను అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా కొన్ని కట్టడాలను కూల్చి వేస్తున్నామని, దీనిపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు విషయమై కేంద్రాన్ని ఒప్పించలేని నాయకులు, ఆలయాల కూల్చివేతపై మాట్లాడటం సబబుకాదని హితవు పలికారు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకుగాను అక్కడి ఇళ్లు, ఆలయాలను కూల్చి వేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేశినేని నాని ప్రస్తావించారు.