: స్వాతంత్ర్యపోరాట యోధులను కులాల పేరుతో విభజించడం బాధాకరం: బీవీ రాఘవులు
స్వాతంత్ర్యం కోసం కులాలకు అతీతంగా పోరాడిన నేతలను ఇప్పటి నేతలు వారిని కులాల పేరుతో విభజించడం బాధాకరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. విశాఖపట్టణంలోని ఆంధ్రాయూనివర్శిటీలో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ జిల్లాను ఏర్పాటు చేస్తే లేనిది, ఎప్పటి నుంచో ప్రజల కోరిక అయిన ‘అల్లూరి’ జిల్లాను ఏర్పాటు చేస్తే వచ్చే ఇబ్బందేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా అమరావతి వద్ద కేంద్రీకృతమవడంతో, మున్ముందు రోజుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ఉద్యమాలు జరిగే అవకాశముందన్నారు.