: అసదుద్దీన్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐసిస్ ఉగ్రవాదులు అమాయకులని, వారికి మద్దతుగా నిలుస్తామన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. సంఘ వ్యతిరేకశక్తులకు అండగా నిలుస్తున్న ఎంఐఎంకు సీఎం కేసీఆర్ మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తామన్న అసదుద్దీన్ పై దేశద్రోహం కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విధ్వంసానికి కుట్ర పన్నిన వారిని సకాలంలో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.