: నాతో మాట్లాడేందుకు కూడా చంద్రబాబు అంగీకరించలేదు: ముద్రగడ సంచలన ఆరోపణ


తెలుగుదేశం పార్టీ, తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న తనపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టిందని కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తుని ఘటన తరువాత తాను చంద్రబాబుతో మాట్లాడాలని ప్రయత్నించగా, అందుకు చంద్రబాబు ఇష్టపడలేదని ఆరోపించారు. ఈ ఉదయం ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఎమర్జెన్సీ ఎలా ఉంటుందో చంద్రబాబు చూపించారని విమర్శించారు. తుని విధ్వంసంపై మరింత లోతైన విచారణకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆపై మాట తప్పిందని, సీబీఐ విచారణకు డిమాండ్ చేయవద్దని మంత్రులే తనను కోరారని అన్నారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై బీసీలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నదే తన అభిమతమని తెలిపారు. రిజర్వేషన్లు రాకుంటే, మలిదశ ఉద్యమం ఎలా సాగాలన్నది కాపు జేఏసీ నిర్ణయిస్తుందని ముద్రగడ అన్నారు.

  • Loading...

More Telugu News