: ఆ చెంపదెబ్బే ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి ప్రాణాలు తీసే పగకు కారణమా?


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. తన వెంట పడుతున్న నిందితుడు రామ్ కుమార్ ను స్వాతి పది రోజుల క్రితం ఓ రైల్వే స్టేషనులో అందరూ చూస్తుండగా చెంపదెబ్బ కొట్టిందని, దాంతోనే రామ్ కుమార్ పగను పెంచుకున్నాడని తెలుస్తోంది. తనకు ఎంఎన్సీలో ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పి, ఆపై ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నట్టు తెలుసుకున్న తరువాత స్వాతి అతన్ని పట్టించుకోలేదన్న సంగతి తెలిసిందే. తమ కుటుంబానికి తానే ఆధారమని, తనను వేధించడం మానుకోవాలని రామ్ కుమార్ కు ఆమె ఎన్నిమార్లు చెప్పినా వినకుండా వెంట పడుతుండటంతోనే అతనిపై చెయ్యి చేసుకుందని తెలుస్తోంది. దీంతో రామ్ లో ఏర్పడిన పగే స్వాతి ప్రాణాలు తీయాలన్న నిర్ణయానికి తీసుకెళ్లిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News