: విషాహారం పెట్టి చిరుతల కాళ్లు నరికి తీసుకెళ్లారు


రెండు చిరుత పులులకు విషాహారం పెట్టి హతమార్చిన అనంతరం వాటి కాళ్లను నరికేసి వేటగాళ్లు తీసుకువెళ్లిన విషాద సంఘటన ఖమ్మం జిల్లా చంద్రగొండు మండలం అబ్బూగూడెంలో జరిగింది. ఈ విషయాన్ని ఇవాళ గుర్తించిన స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు చిరుతపులుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వేటగాళ్లు పెట్టిన విషాహారం తినడం వల్లే రెండు చిరుతలు మరణించినట్లు అటవీశాఖాధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News