: జనాలను తెచ్చి అడ్డుకుంటే భయపడతామా?: కన్నా నిప్పులు
ప్రజల పక్షాన నిలబడి, వారికి అండగా ఉండాలని వచ్చిన తమను జనాలను తెచ్చి అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ చూస్తోందని, ఈ తరహా చర్యలతో తమను భయపెట్టలేరని మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడ గోశాల రహదారి వద్ద రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన వారు మీడియా సమావేశం నిర్వహించబోగా, కొందరు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో వారిపై మండిపడ్డ కన్నా, కొందరు స్థానిక నేతలు వచ్చి గొడవ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అభ్యంతరకర భాషను వాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సమస్యను పరిష్కరించాలన్నదే తమ అభిమతమని తెలిపారు. కాగా, గొడవ పెరుగుతూ ఉండటంతో, ప్రెస్ మీట్ ను నిర్వహించకుండానే బీజేపీ నేతలు తిరిగి వెళ్లిపోయారు.