: అశ్లీల చిత్రాలను పోస్ట్ చేస్తూ మాజీ గర్ల్ ఫ్రెండ్ ను వేధిస్తున్న ఇంజనీర్... అరెస్ట్ చేసిన పోలీసులు!


తన మాజీ గర్ల్ ఫ్రెండ్ పై పగ తీర్చుకోవాలని భావించిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ రూపేష్ చేసిన పని ఇప్పుడతనిని కటకటాల వెనక్కు నెట్టింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రూపేష్, మరో యువతి ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న సమయంలో క్లాస్ మేట్స్. వారి స్నేహం ప్రేమగా మారగా, ఇద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. సన్నిహితంగా మెలిగారు. ఆపై రూపేష్ ప్రవర్తన నచ్చక ఆ యువతి అతన్ని దూరం పెట్టింది. ఆపై మరో వ్యక్తిని వివాహం చేసుకుని హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో చేరింది. తనను కాదన్న ఆమె తీరును జీర్ణించుకోలేకపోయిన రూపేష్, తాము సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న చిత్రాలను పోర్న్ వెబ్ సైట్లలో పెట్టడం ప్రారంభించాడు. అశ్లీల చిత్రాలను పోస్టు చేశాడు. ఆ సీడీలను ఆమెకు పంపాడు. దీని గురించి తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు షీ టీమ్స్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ను ఆశ్రయించారు. దీంతో మాదాపూర్ సమీపంలోని అయ్యప్ప సొసైటీలో మాటేసి రూపేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు సెక్షన్ 354 (మహిళలపై వేధింపులు) కింద కేసు పెట్టారు. ఆన్ లైన్లో పోస్ట్ చేసిన ఆమె నగ్న చిత్రాలను డిలీట్ చేశారు. అతని తల్లిదండ్రులను పిలిచి వారి ముందే కౌన్సెలింగ్ చేశారు.

  • Loading...

More Telugu News