: తిన్న ఐస్ క్రీంకు రూ. 30 చెల్లించాలని అడిగినందుకు హత్య!


తన వద్ద కొనుక్కొని తిన్న ఐస్ క్రీంకు రూ. 30 చెల్లించాలని అడిగిన చిరు వ్యాపారిని దారుణంగా కొట్టి చంపిన ఘటన ఘజియాపూర్ లోని మహారాజ్ పూర్ లో జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మహమ్మద్ ఇస్లాం అనే చిరు వ్యాపారి తన భార్య, పాప, బాలుడుతో పాటు ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఐస్ క్రీం అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే కొంతమంది రోజూ ఇస్లాం వద్ద ఐస్ క్రీంలను బలవంతంగా తీసుకుని తింటుండేవారు. ఏనాడూ డబ్బులు చెల్లించేవారు కాదు. ఈ క్రమంలో తనకు నష్టం పెరుగుతుండటంతో ఇస్లాం, తిన్న ఐస్ క్రీంకు డబ్బివ్వాలని కోరడమే అతను చేసిన నేరమైంది. మమ్మల్నే డబ్బడుగుతావా? అంటూ వారంతా అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఇస్లాం కూడా తెగించి ప్రతిదాడికి దిగగా, అతని రెండు చేతులూ పట్టుకుని, మరణించే వరకూ కొట్టారు. ఆపై మృతదేహాన్ని ఇంటి ముందుకు తెచ్చి పడేసి వెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News