: తండ్రితో కలసి బైక్ పై వస్తున్న యువతి కిడ్నాప్... కరీంనగర్ జిల్లాలో కలకలం!
తన తండ్రితో కలసి పుట్టింటికి వెళుతున్న నవ వధువును గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన ఉదంతం కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన మౌనిక (19)కు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. శనివారం రాత్రి ఆమెను పుట్టింటికి తీసుకువెళ్లేందుకు వచ్చిన తండ్రి, మౌనికను వెంటబెట్టుకుని బయలుదేరాడు. గోవిందారం గ్రామం సమీపంలో బైక్ ను అడ్డుకున్న ఇద్దరు, తండ్రిని కొట్టి మౌనికను బలవంతంగా తీసుకెళ్లారు. ఆయన ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఆమెను ఎటువైపు తీసుకువెళ్లి ఉంటారన్న విషయమై స్థానికులను ప్రశ్నిస్తున్నారు.