: ఆంధ్రా న్యాయమూర్తుల వల్ల తెలంగాణకు తీవ్రమైన అన్యాయం: సీజేతో తెలంగాణ న్యాయవాదులు


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించక పోవడంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని టీఎస్-బార్ అసోసియేషన్ పేర్కొంది. ఈ ఉదయం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో సమావేశమైన బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదుల బృందం తక్షణం హైకోర్టును విడగొట్టాలన్న తమ వాదనకు కారణాలను తెలిపింది. తెలంగాణ హైకోర్టులో ఆంధ్రా న్యాయమూర్తులు అధికంగా ఉన్నారని, దీనివల్ల పలు కేసుల్లో అన్యాయం జరుగుతోందని వివరించారు. ఎంతో మంది న్యాయమూర్తులు తెలంగాణ ఆప్షన్ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇక్కడే ఉండి పోయారని వారు తెలిపారు. దీంతో సీనియారిటీ ఉన్న తెలంగాణ న్యాయవాదులకు ప్రమోషన్లు దక్కడం లేదని వివరించారు. కాగా, ఆంధ్రా న్యాయమూర్తుల వల్ల కేసుల్లో అన్యాయం జరుగుతోందన్న మాటలకు సీజే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News