: నాన్నా! టెర్రరిస్టులు ఒక్కొక్కళ్లనూ చంపుతున్నారు... భయంగా వుంది నాన్నా!: తండ్రికి ఫోన్ చేసి చెప్పిన తారిషి


"ఉగ్రవాదులు రెస్టారెంట్ లోకి వచ్చారు నాన్నా. ఒక్కొక్కళ్లనూ చంపేస్తున్నారు. భయంగా వుంది నాన్నా. నేను ప్రాణాలతో బయటకు వస్తానో... రాలేనో..." ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత యువతి తారిషి జైన్ తన తండ్రికి చెప్పిన మాటలివి. ఉగ్రవాదులు చొరబడ్డ తరువాత తన స్నేహితులు ఫరాజ్ అయాజ్ హుస్సేన్, అబింతా కబీర్ లతో కలిసి ఓ టాయ్ లెట్ లో దాక్కున్న తరువాత తారిషి తన తండ్రికి ఫోన్ చేసింది. తమను కూడా ఒకరి తరువాత ఒకరిని చంపేస్తారని భయపడుతూ చెప్పింది. ఆపై తారిషి ఫోన్ స్విచ్చాఫ్ రాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఆమె మరణించింది. కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదువుతున్న ఆమె, బంగ్లాదేశ్ బ్యాంకులో ఇంటర్న్ షిప్ కోసం ఢాకాకు వెళ్లింది.

  • Loading...

More Telugu News