: భారతీయ యువకులను ఆత్మాహుతి దళాలుగా తీర్చిదిద్దుతున్న ఐఎస్.. వారు మంచి ‘ఫైటర్లు’ కాదన్న ఫ్రెంచ్ జిహాదీ


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ(ఐఎస్ఐఎస్)లో చేరుతున్న భారతీయ యువకులను ఐఎస్ అంత గొప్పవారిగా గుర్తించడం లేదా? వారిలో తగిన ‘ఫైటింగ్’ సామర్థ్యం లేదా..? అవుననే అంటున్నాడు గతేడాది పారిస్ పేలుళ్ల సమయంలో పట్టుబడిన ఫ్రెంచ్ జిహాదీ రెడా హ్యామ్. ఐఎస్‌లో చేరుతున్న ఇతర దేశాల యువకులతో పోలిస్తే వీరిలో యుద్ధ నైపుణ్యం చాలా తక్కువ ఉన్నట్టు పేర్కొన్నాడు. అందుకే వారికి ఐఎస్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఆత్మాహుతి దళాలుగా తయారుచేస్తోందని పేర్కొన్నాడు. కాగా కలష్నికోవ్ తుపాకులు చేతబట్టి హామ్స్ ప్రావిన్స్‌లో సిరియా దళాలపై పోరాడుతున్న భారతీయ యువకుల వీడియోను గత నెలలో ఐఎస్ విడుదల చేసింది. ఈ వీడియోను చూపి మరింతమంది భారతీయ యువకులను జిహాదీలుగా మార్చి సిరియా దళాలపై పోరుకు దిగడమే ఐఎస్ ఉద్దేశమని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రాన్స్ పేలుళ్ల అనంతరం పట్టుబడిన జిహాదీ రెడా హ్యామ్ దర్యాప్తులో భాగంగా పలు విషయాలు వెల్లడించాడు. సిరియాలో తనను డార్మెటరీలో ఉంచారని, అక్కడ తాను పలువురు భారతీయులు, రష్యన్లు, చెచెన్యన్లు, చైనీయులు, ఓ అమెరికా వ్యక్తిని చూసినట్టు తెలిపాడు. కాగా ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తున్న భారతీయ యువకుల్లో సరైన నైపుణ్యాలు లేవని భావిస్తున్న ఐఎస్ వారిని టాయిలెట్ క్లీనర్లుగా మంచినీళ్లు మోసే పనివాళ్లుగా ఉపయోగించుకుంటున్నట్టు భారత ఏజెన్సీలు పేర్కొన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 25 మంది భారతీయ యువకులు ఐఎస్‌లో చేరగా వారిలో ఆరుగురు మృతి చెందారు.

  • Loading...

More Telugu News