: తెలంగాణలో ఇక 'జగ్గు' బీర్లు... అనుమతి దస్త్రాలపై సంతకం చేసిన కేసీఆర్!
తెలంగాణలో డ్రాఫ్ట్ బీర్లను తయారు చేసి అప్పటికప్పుడు జగ్గుల్లో పోసి విక్రయించేలా 20 మైక్రో బ్లూవరీ సంస్థలకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు నుంచి వచ్చిన ఫైల్ పై కేసీఆర్ సంతకం చేశారు. తెలంగాణలో డ్రాఫ్ట్ బీర్ తయారీకి సంస్థలకు అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. ఒక్కో మైక్రో బ్రూవరీ నుంచి రూ. 3 లక్షల వరకూ లైసెన్స్ ఫీజును వసూలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం 50కి పైగా దరఖాస్తులు రాగా, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ఎక్సైజ్, ఐటీ శాఖల కమిషనర్లు చంద్రవదన్, అనిల్ కుమార్ లు వీటిని పరిశీలించి స్క్రూటినీ చేశారు. ఈ డ్రాఫ్ట్ బీర్ కేవలం 36 గంటలు మాత్రమే నిల్వ వుంటుంది.