: ఫేస్‌బుక్ మహిళా ఉద్యోగులకు డ్రెస్ కోడ్.. శరీరాన్ని బహిర్గతపరిచే దుస్తులు ధరించొద్దని ఆదేశం

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా డ్రెస్‌కోడ్‌లోకి ప్రవేశించింది. ఇక నుంచి ఫేస్‌బుక్‌లోని మహిళా ఉద్యోగులు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్ పాటించాల్సిందేనని ఆదేశించింది. కురచ దుస్తులు, శరీరం బహిర్గతమయ్యేలాంటి దుస్తులు వేసుకోవడం వల్ల పురుష ఉద్యోగులు ‘డిస్టర్బ్’ అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పనితీరుపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుండడంతో ఇక నుంచి మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా ఉండే దుస్తులు ధరించాలని ఫేస్‌బుక్ ఆదేశించింది. తమ వయసును దాచిపెట్టేందుకు చాలామంది మహిళా ఉద్యోగులు వేసుకొస్తున్న కురచ దుస్తుల వల్ల తమకు చాలా అసౌకర్యంగా ఉందని కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో డ్రెస్‌కోడ్ తప్పనిసరి చేసినట్టు సమాచారం. అయితే మహిళా ఉద్యోగులు ఎటువంటి దుస్తులు ధరించాలి అన్నదానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.

More Telugu News