: స్మార్ట్ ఫోన్ లో నెట్ స్పీడును తెలిపే ట్రాయ్ కొత్త యాప్


3జీ, 4జీ స్మార్ట్ ఫోన్లు వాడుతూ కూడా ఇంటర్నెట్ వేగం అసంతృప్తిని కలిగిస్తోందని వస్తున్న ఫిర్యాదులపై ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) స్పందించింది. స్మార్ట్ ఫోన్ల ఇంటర్నెట్ వేగాన్ని తెలిపే మొబైల్ యాప్ 'మై స్పేస్'ను విడుదల చేయనుంది. ది మొబైల్ సేవా యాప్ స్టోర్ లో లభ్యమయ్యే దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే, మొబైల్ నెట్ వేగం పరిశీలించుకోవచ్చని, విశ్లేషణలను ట్రాయ్ ఎనలిటిక్స్ పోర్టల్ కు పంపవచ్చని అధికారులు తెలిపారు. సిగ్నల్స్ బలం, డేటా వేగం, నెట్ వర్క్ సమాచారం తదితరాలను ఈ యాప్ సేకరిస్తుందని, 5వ తేదీ నుంచి ఈ యాప్ అందుబాటులో ఉంటుందని వివరించారు. టెలికం సంస్థలు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలను అందించడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ యాప్ ను రూపొందించారు.

  • Loading...

More Telugu News