: వియన్నా సూపర్ మార్కెట్‌లో కాల్పులు.. ఉగ్రదాడని అనుమానం!
ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లోకి చొరబడి విదేశీయులను ఊచకోత కోసిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఏరిపారేసిన కాసేపటికే ఆస్ట్రియాలోని వియన్నాలో కాల్పుల కలకలం రేగింది. శనివారం సాయంత్రం ఏడుగంటలకు షోన్‌బ్రన్ ప్రాంతంలో ఓ సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించిన సాయుధుడు ఒకరు విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణ నష్టంపై ఎటువంటి సమాచారం లేదు. కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దుండగుడిని కాల్చి చంపారు. దీనిని ఉగ్రదాడిగానే భావిస్తుండగా ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. సాయుధుడిని హతమార్చిన అనంతరం పట్టణంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.