: ఉత్తరాఖండ్ లో రెండు గంటల్లో 100 మిల్లీ మీటర్ల వర్షం
ఉత్తరాఖండ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 2013లో సంభవించిన వరదలను గుర్తు చేస్తూ మరోసారి ఉత్తరాఖండ్ లో వర్షాలు కుంభవృష్టి పడుతోంది. కేవలం రెండు గంటల్లో కురిసిన వానతో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే అక్కడ వర్షాలు ఏ స్థాయిలో కురుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడ వాగులు, వంకలు పొంగిపొరలుతున్నాయి. దీంతో గిరిజనులు ఎక్కువగా గల ఉత్తరాఖండ్ లో వారి జీవనం అతలాకుతలం అవుతోంది. 2013లో సంభవించిన వరదల అనంతరం అక్కడి ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.