: స్పీకర్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది: వైఎస్సార్సీపీ


పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తమ పార్టీ సమర్పించిన అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని వైఎస్సార్సీపీ తెలిపింది. హైదరాబాదులో ఆ పార్టీ ప్రతినిధులు స్పీకర్ నిర్ణయంపై స్పందిస్తూ, సాంకేతిక కారణాలతో పార్టీ మారిన 13 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను చెల్లవని చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ టికెట్ పై గెలిచి టీడీపీలో చేరింది వాస్తవం కాదా? అని వారు ప్రశ్నించారు. అనర్హులపై వేటు వేయడం స్పీకర్ బాధ్యత అని చెప్పిన ఆ పార్టీ ప్రతినిధులు, ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసు విచారణకు రానున్న నేపథ్యంలో స్పీకర్ ఈ రకంగా వ్యవహరించారని ఆరోపించారు. నిర్ణయం తీసుకునేముందు పిటిషనర్లకు తమ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాల్సిన స్పీకర్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయమని వారు మండిపడ్డారు. స్పీకర్...ఖ్వాజీ జుడిషియల్ ట్రైబ్యునల్ మాత్రమేనని, ట్రైబ్యునల్ నియమ నిబంధనలను స్పీకర్ పాటించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.

  • Loading...

More Telugu News