: నకిలీ యూనివర్సిటీల్లో యూపీదే అగ్రస్థానం!


దేశంలోని నకిలీ యూనివర్సిటీల్లో అత్యధికం ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తెలిపింది. యూజీసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 22 నకిలీ యూనివర్సిటీలు ఉండగా, వాటిలో 8 నకిలీ యూనివర్సిటీలు కేవలం ఉత్తరప్రదేశ్‌ లోనే ఉన్నాయని వెల్లడించింది. ఈ జాబితాలో గురుకుల్‌ యూనివర్సిటీ (బృందావన్‌), మహిళా గ్రామ విద్యాపీఠ్‌ (అలహాబాద్‌), గాంధీ హిందీ విద్యాపీఠ్‌ (అలహాబాద్‌), నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి (కాన్పూర్‌), ఇంద్రప్రస్థా ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (నోయిడా), వారణాసెయ సంస్కృత యూనివర్సిటీ (వారణాసి), నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (అలీగఢ్‌)లు ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఈ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించాలని అధికారులు సూచించారు. ఇతర యూనివర్సిటీల గురించి యూజీసీ వెబ్ సైట్ సందర్శించి తెలుసుకోవచ్చని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News