: విశాఖలో ముగిసిన బే మారథాన్
విశాఖపట్టణంలో జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నైట్ బే మారథాన్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ప్రారంభమైన ఈ బే మారథాన్, ఆయన ఆధ్వర్యంలోనే ముగిసింది. ఈ మారథాన్ లో సుమారు 7,500 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. బే మారథాన్ లో భాగంగా 3కే, 5కే, 21కే రన్ నిర్వహించారు. వర్షపు తుంపర్లు పడుతుండగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో యువకులు మారథాన్ ను ముగించారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయగా, పాల్గొన్నవారందరికీ సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఇలాంటి రన్ లు నిర్వహించడం ద్వారా విశాఖను గ్లోబల్ స్థాయిలో ఆకర్షిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.