: హైకోర్టు విభజన విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు...రాష్ట్రాలే చూసుకోవాలి: దత్తాత్రేయ


హైకోర్టు విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గవర్నర్ నరసింహన్ తో భేటీ అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ, హైకోర్టు విభజన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చోరవతీసుకుని హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి, సత్వరం విభజన జరిగేలా చొరవతీసుకోవాలని ఆయన సూచించారు. న్యాయవాదులను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని పార్టీలు చూడడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News