: రజనీకాంత్ అంగీకరిస్తే పుదుచ్చేరి 'పారిస్ ఆఫ్ ఇండియా' అవుతుంది: కిరణ్ బేడీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంగీకరిస్తే పుదుచ్చేరి 'పారిస్ ఆఫ్ ఇండియా' అవుతుందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా రజనీకాంత్ కు ఓ ఆఫర్ పంపారు. రజనీకాంత్ 'ప్రొస్పరస్ పుదుచ్ఛేరి' బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరారు. పాండిచ్చేరి అభివృద్ధికి ఎంతో చేయాల్సింది ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారనుకుంటున్నానని, తన ఆహ్వానంపై ఆయన స్పందిస్తారని భావిస్తున్నానని ఆమె తెలిపారు. కాగా, రజనీకాంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.