: కరీబియన్ లీగ్ లో షారూఖ్ టీ20 జట్టు రికార్డు భాగస్వామ్యం
కరీబియన్ లీగ్ లో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ భాగస్వామిగా ఉన్న 'ట్రినిబాగో నైట్ రైడర్స్' జట్టు ఆటగాళ్ల రికార్డు భాగస్వామ్యంతో తొలి విజయం సాధించింది. బార్బొడోస్ ట్రిడెంట్స్, ట్రినిబాగో నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన షారూఖ్ జట్టు 20 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్టార్ ఆటగాళ్లు హషీమ్ ఆమ్లా (81), డ్వెన్ బ్రావో (66) రాణించి 150 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేయడంతో 170 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బొడోస్ ట్రిడెంట్స్ జట్టు కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ట్రినిబాగో నైట్ రైడర్స్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, టీ20 చరిత్రలో ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.