: ఆ 20 మందిని కిరాతకంగా నరికి చంపారు: బంగ్లా ఆర్మీ బ్రిగేడియర్ అధికారి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హోలీ ఆరిస్టాన్ బేకరీ రెస్టారెంట్ పై దాడికి తెగబడిన ఉగ్రమూకల పని చూస్తే ఐఎస్ఐఎస్ తీవ్రాదులపనే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వస్తున్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు దూరంగా ఉన్న వారిని తుపాకులతో భయపెట్టి చంపుతారు. అయితే పట్టుబడ్డ వారిలో కీలకమైన వారుంటే మాత్రం వారి రక్తం రుచిచూస్తారు. వారి కుత్తుకలను కోసి చంపుతారు. ఢాకా ఆపరేషన్ ముగిసిన అనంతరం రెస్టారెంట్ లో అడుగుపెట్టిన భద్రతా దళాలకు 20 మృతదేహాలు లభ్యమయ్యాయని ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ నయీమ్ అష్ఫాక్ చౌదరి తెలిపారు. వారందర్నీ తీవ్రవాదులు పదునైన ఆయుధాలతో నరికి చంపారని ఆయన తెలిపారు. ఉగ్రవాదులు చంపినవారంతా విదేశీయులేనని ఆయన చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కాగా, ఈ ఘటనకు బాధ్యులమంటూ ఐఎస్ఐఎస్, లష్కరే తోయిబా తమకు తాము ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News