: ఫైబర్ ఆప్టిక్ ద్వారా తెలంగాణలోని ప్రతీ ఇంటికి ఇంటర్‌నెట్ సౌకర్యం: కేటీఆర్
డిజిటల్ తెలంగాణను సాధించే క్రమంలో ఫైబర్ ఆప్టిక్ ద్వారా తెలంగాణలోని ప్రతీ ఇంటికి ఇంటర్‌నెట్ సౌకర్యం అందించనున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్ లో డిజిటల్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రపంచంలోని ఐదు గొప్ప కంపెనీలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం టీ హబ్‌ను ఏర్పాటు చేసి యువత సృజనాత్మకమైన ఆలోచనలను పంచుకొనేలా కృషి చేస్తోందని ఆయన చెప్పారు.