: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట... వైఎస్సార్సీపీ పిటిషన్ ను తిరస్కరించిన స్పీకర్ కోడెల
వైఎస్‌ఆర్సీపీ నుంచి టీడీపీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ కు ఆ పార్టీ సమర్పించిన పిటిషన్ ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు సాంకేతిక కారణాలను చూపుతూ తిరస్కరించారు. తమ పార్టీ నుంచి అధికారపార్టీలోకి వెళ్లిన 13 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చాలా కాలంగా వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. తాజాగా ఈమేరకు అనర్హత పిటిషన్ ను స్పీకర్ కు సమర్పించింది. అయితే ఈ పిటిషన్ లోపభూయిష్టంగా ఉందని, సరైన ఫార్మాట్ లో, రాజ్యంగబద్ధంగా లేనందున దానిని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ కోడెల వైఎస్సార్సీపీకి సమాధానం ఇచ్చారు. దీంతో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.