: ఈ ఏడాది ‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’ రూపంలో కొలువుదీరనున్న ఖైరతాబాద్ గణేశుడు
ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన ఖైరతాబాద్ గణేశుని విగ్రహం ఈ సారి ‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి’ రూపంలో కొలువుదీరనుంది. భారీ గణనాథుని పక్కన వేంకటేశ్వరస్వామి, గోవర్థన గిరిధారియైన శ్రీకృష్ణుడి ప్రత్యేక విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. గతనెల 16 న ఖైరతాబాద్ గణేశుని విగ్రహ నిర్మాణానికి విగ్రహ నిర్మాణ పూజ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తుపై కొన్ని రోజుల క్రితం అనిశ్చితి ఏర్పడింది. చివరకి అనేక తర్జన భర్జనల తరువాత గత ఏడాది కంటే ఒక్క అడుగు తగ్గించి 58 అడుగుల గణేశ్ విగ్రహాన్ని కొలువుదీరుస్తున్నామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపిన విషయం తెలిసిందే.