: ఆ లేఖ అందలేదు!... వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా లేఖపై స్పందించిన కోడెల ఆఫీస్!
విపక్ష ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ మేరకు మర్యాద దక్కడం లేదన్న ఆవేదనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానంటూ కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్ది నిన్న చేసిన ప్రకటనపై స్పీకర్ కోడెల శివప్రసాద్ కార్యాలయం కొద్దిసేపటి క్రితం స్పందించింది. ప్రభుత్వం చేపడుతున్న అధికారిక కార్యక్రమాల్లో విపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం దక్కడం లేదని ఆరోపించిన రఘురామిరెడ్డి... తన రాజీనామా లేఖను ఫ్యాక్స్, కొరియర్ లో స్పీకర్ కు పంపానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రఘురామిరెడ్డి చెప్పినట్లు తమ కార్యాలయానికి ఎలాంటి రాజీనామా లేఖ అందలేదని స్పీకర్ కార్యాలయం ప్రకటించింది.