: ఈడీ అటాచ్ తో వైఎస్ జగన్ కుదేలు!... అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు!
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీలో వింత పరిస్థితి నెలకొంది. ఓ వైపు అక్రమాస్తుల కేసులో ఈడీ ఆస్తుల అటాచ్ మెంట్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఇబ్బందుల్లో పడిపోతే... ఆ పార్టీ ఎమ్మెల్యేలు, జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ పలువురు కీలక నేతలు అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో కొరడా ఝుళిపించిన ఈడీ... ఒకే దఫా రూ.750 కోట్ల మేర జగన్ ఆస్తులను అటాచ్ చేసింది. దీంతో తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయం పట్టుకున్న జగన్... జ్యోతిష్కులను ఇంటికి పిలిపించుకుని మరీ జాతకం చెప్పించుకున్నారు. దోష నివారణ కోసం జ్యోతిష్కులు చెప్పిన మేర యఙ్ఞ యాగాదులు చేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో జగన్ ఉంటే... జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా... అమెరికాలో జరుగుతున్న ఆటా సభలకు వెళ్లారు. అక్కడ ఆటపాటలను చూస్తూ వారు ఎంజాయ్ చేస్తున్నారట.