: పాతబస్తీలో ఉగ్రవాదుల అరెస్ట్ ఎఫెక్ట్!... ‘అనంత’లో ముమ్మరంగా సోదాలు!
భాగ్యనగరి హైదరాబాదు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పెను విధ్వంసానికి కుట్ర పన్నిన ఐఎస్ ఉగ్రవాదులను ఇటీవలే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పాతబస్తీలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన విచారణలో భాగంగా ఇద్దరు ఉగ్రవాదులు ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటించినట్లు తేలింది. దీంతో అనంతపురం జిల్లాలో ఉగ్రవాదుల మూలాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా నేటి ఉదయం రంగంలోకి దిగిన పోలీసులు జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలు, సినిమా హాళ్లు, హోటళ్లు తదితరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసుల ముమ్మర సోదాలతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.