: చంచల్ గూడకు భాను కిరణ్!... చర్లపల్లి నుంచి తరలింపునకు కోర్టు ఓకే!


కాంగ్రెస్ పార్టీ నేత మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్ది (సూరి) హత్య కేసు ప్రధాన నిందితుడు భాను కిరణ్ చర్లపల్లి జైలు అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తూ మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడట. అక్రమ కార్యకాలపాలతో పేట్రేగిపోతున్న అతడు జైలు అధికారులకు ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాడట. ఈ మేరకు అతడిని తాము భరించలేమని నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన చర్లపల్లి జైలు అధికారులకు కోర్టు ఊరటనిచ్చింది. చర్లపల్లి జైలు నుంచి అతడిని చంచల్ గూడ జైలుకు తరలించాలని కొద్దిసేపటి క్రితం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరికాసేపట్లో భాను కిరణ్ ను జైలు అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.

  • Loading...

More Telugu News