: భాగ్యనగరిలో కుప్పకూలిన ‘ఐడియా’ నెట్ వర్క్!... వినియోగదారుల గగ్గోలు, పట్టించుకోని యాజమాన్యం!
భాగ్యనగరి హైదరాబాదులో నేటి ఉదయం మరో కలకలం రేగింది. ఐడియా సెల్యూలార్ నెట్ వర్క్ కు చెందిన ఏ ఒక్క వినియోగదారుడి ఫోన్ మోగడం లేదు. సదరు మొబైళ్ల నుంచి ఫోన్ చేద్దామన్నా కుదరడం లేదు. దీంతో గగ్గోలు పెట్టిన వినియోగదారులకు సదరు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి స్పందన లభించలేదు. వెరసి ఐడియా నెట్ వర్క్ వినియెగిస్తున్న మొబైల్ వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నగరంలో ఐడియా నెట్ వర్క్ కుప్పకూలిన నేపథ్యంలో ఆ సర్వీసుకు చెందిన మొబైల్ ఫోన్లన్నీ గంటసేపటి నుంచి మూగబోయాయి. సిగ్నల్ అందక ఇన్ కమింగ్ , అవుట్ గోయింగ్ కాల్స్ నిలిచిపోయాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు యత్నించిన వినియోగదారులకు యాజమాన్యం నుంచి స్పందన కరవైంది. ఐడియా నెట్ వర్క్ కుప్పకూలడానికి గల కారణాలు తెలియరాలేదు.