: కార్యరంగంలోకి కుంబ్లే!... రేపు ద్రావిడ్, ధోనీ, కోహ్లీలతో కీలక భేటీ!


టీమిండియా హెడ్ కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఏ ఒక్క క్షణాన్ని వేస్ట్ చేయదలచుకునేందుకు సిద్ధంగా లేరట. ఇప్పటికే కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన రేపు బెంగళూరు వేదికగా కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని ఫార్మాట్లకు చెందిన జట్లను మేటి జట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కుంబ్లే... రేపటి భేటీకి జూనియర్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలను ఈ భేటీకి ఆహ్వానించారు. అంతేకాకుండా సీనియర్, జూనియర్ జట్ల సెలెక్టర్లకు కూడా ఆయన కబురుపెట్టారట. జట్ల ప్రదర్శన మెరుగవ్వాలంటే... ఆటగాళ్ల ఎంపిక కూడా కీలకమేనని కుంబ్లే భావిస్తున్నారు. ఈ క్రమంలో సెలెక్టర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News