: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ని కలిసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తెలంగాణలో న్యాయవాదుల ఆందోళన ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబాసాహెబ్ బోస్లే ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీ.ఎస్.ఠాకూర్‌తో ఆయన భేటీ అయ్యారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల సస్పెన్షన్, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి బోస్లే వివరిస్తున్నారు. సస్పెండ్‌కు గురయిన న్యాయాధికారులు, ఉద్యోగులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతోన్న అంశం, దీని చుట్టూ తిరుగుతోన్న రాజకీయ పరిణామాలు కూడా చర్చకు రానున్నట్లు సమాచారం. హైకోర్టు విభజనపై తెలంగాణ న్యాయవాదులు ఢిల్లీలో ఆందోళనకు దిగుతామని నిన్న హెచ్చరించిన విషయం తెలిసిందే.