: సూళ్లూరుపేటకు వైఎస్ జగన్... రాజారెడ్డి అంత్యక్రియలకు స్వయంగా హాజరుకానున్న విపక్ష నేత


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలోని సూళ్లురుపేటకు వెళ్లనున్న జగన్... అక్కడ ఆ పార్టీ నేత రాజారెడ్డి అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొంటారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో ఉన్న రాజారెడ్డి నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాజారెడ్డి మరణంపై నిన్ననే తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన జగన్... నేడు జరగనున్న రాజారెడ్డి అంత్యక్రియల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నేడు హైదరాబాదు నుంచి బయలుదేరనున్న జగన్... రాజారెడ్డి అంత్యక్రియలకు హాజరై సాయంత్రానికి తిరిగి హైదరాబాదు చేరుకుంటారు.

  • Loading...

More Telugu News