: వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు రాజారెడ్డి కన్నుమూత... జగన్ సంతాపం
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు డి.రాజారెడ్డి ఈరోజు కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, రాజారెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్, పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. రేపు జరగనున్న అంత్యక్రియలకు జగన్, పార్టీ నాయకులు హాజరుకానున్నారని పార్టీ వర్గాల సమాచారం.