: ఐసిస్ ఉగ్రవాదులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు
ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలులో వున్న ఐదుగురు ఉగ్రవాదులను ఈ నెల 12 వరకు విచారించేందుకు ఎన్ఐఏ అధికారులకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. కాగా, హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఈ ఉగ్రవాదుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఒక ఎయిర్ గన్, మూడు ల్యాప్ టాప్ లు, ఏడు పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నారు.